Header Banner

ట్రంప్ సర్కార్ మరో షాక్! వీసా, గ్రీన్ కార్డ్‌లపై కొత్త అడ్డంకులు! ఇక నుండి అది తప్పనిసరి!

  Fri Apr 11, 2025 21:52        U S A

అమెరికా వీసా, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే వలసదారుల్ని దేశం నుంచి సాధ్యమైనంత వేగంగా బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ సర్కార్.. వీసా, గ్రీన్ కార్డుదారులపైనా తనిఖీలు పెంచింది. ఇదే క్రమంలో కొత్తగా వీసా, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మరో షాకిచ్చింది. ఈ మేరకు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది.

 

అమెరికా వీసాలు, గ్రీన్ కార్డులు కోరుకుంటున్న వారిని ఫిల్టర్ చేసేందుకు ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై యూదులకు వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారికి వీసాలు, గ్రీన్ కార్డులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు దరఖాస్తుదారుల సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిఘా పెడతామని ప్రకటించింది. ఇప్పటికే అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, హౌతీ, హెజ్బొల్లాతో పాటు మరికొన్ని సంస్థలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారి వీసా, గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని తిరస్కరించాలని సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిర్ణయించింది. ఆయా గ్రూపులకు మద్దతుగా పెట్టే పోస్టుల్ని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని తెలిపింది. ఉగ్రవాదుల సానుభూతిపరుల్ని తమ దేశంలోకి రానివ్వాల్సిన అవసరం లేదని సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తేల్చిచెప్పేసింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USVisa #GreenCard #ImmigrationPolicy #TrumpAdministration #SocialMediaCheck #VisaDenial #USCIS #AntiTerrorMeasures #ImmigrationRules #VisaAlert